గుంటూరు జిల్లాలో తాజాగా నమోదైన 6 పాజిటివ్ కేసులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 382కి చేరింది. తాజాగా నమోదైన 6 కేసుల్లో నరసరావుపేట, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో రెండేసి చొప్పున నమోదయ్యాయి. ఇవన్నీ కంటైన్మెంట్ జోన్లలోనే కావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 382 కేసులు నమోదు కాగా... అందులో 176 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మరో 198 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 8 మంది మృతిచెందారు. తాజా కేసులతో ఇప్పటివరకు నరసరావుపేటలో 165 కేసులు, గుంటూరులో 161 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే లక్ష్యంతో మిషన్ మే-15 పేరుతో కేసుల కట్టడికి అధికారులు కృషి చేస్తున్నారు. పూర్తిస్థాయి లాక్డౌన్ను ఈనెల 13 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.