ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి మండపంలో అమరావతి నినాదం... రైతులకు సన్మానం...

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలు 367వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా అనంతవరంలో ఓ పెళ్లిలో మహిళలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

amaravathi movement
367వ రోజు కొనసాగిన అమరావతి రైతుల నిరసన దీక్షలు

By

Published : Dec 18, 2020, 9:00 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కొరుతూ.. రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలను 367వ రోజు కొనసాగించారు. తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, మందడంలో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. అనంతవరంలో ఓ పెళ్లిలో మహిళలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. నూతన జంట జై అమరావతి అంటూ నినాదించారు.

రాజధాని కోసం అక్కడ ఏడాది కాలంగా పోరాటం చేస్తున్న రైతులను ఎన్నారై తెదేపా నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతుల కాళ్లు కడిగారు. అనంతరం పచ్చ కండువాలను పంపిణీ చేశారు. అమరావతి యువజన ఐకాస కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ, గుమ్మడి గోపాలకృష్ణ, మూల్పూరి సాయి కళ్యాణి.. రైతులను సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details