ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PDS RICE SEIZED: 172 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా రేపల్లె మండల పరిధిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 172 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్​ అధికారులు స్వాధీనం(pds rice seized at repalle) చేసుకున్నారు. ఈ కేసులో నిందితునిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్​ సీఐ శ్రీహరి వెల్లడించారు.

pds rice seized at guntur
రేపల్లె మండలంలో రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Oct 1, 2021, 8:44 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో అనధికారికంగా భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం(pds rice seized at guntur)ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పెనుమూడి గ్రామ సమీపంలో ఉన్న ఓ పాత ఇంటిని గోడౌన్‌గా మార్చి అనధికారికంగా పీడీఎస్​ బియ్యాన్ని నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు గోడెన్​పై దాడులు నిర్వహించారు. సుమారు 354 బస్తా(354 bags rations rice seized)ల్లో ఉన్న 172 క్వింటాళ్ల బియ్యం(pds rice) స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్​ సీఐ శ్రీహరి వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాధాకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు విజిలెన్స్ సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details