ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3,347 మంది వ్యవసాయ వలస కూలీలు తరలింపు - lock down seens of migrant workers

గుంటూరు జిల్లా మెడికొండ్రు, ఫిరంగిపురం మండలంలో ఇరుక్కుపోయిన వ్యవసాయ వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. దాదాపు 62 బస్సుల్లో 3,347 మంది వ్యవసాయ వలస కూలీలను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

guntur district
3,347 మంది వ్యవసాయ వలస కూలీలు తరలింపు.

By

Published : May 11, 2020, 7:44 PM IST

గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో మెడికొండ్రు, ఫిరంగిపురం మండలంలో ఇరుక్కుపోయిన వ్యవసాయ వలస కూలీలను తమ సొంతూళ్లకు తరలించేందుకు అధికారులు 62 బస్సులు ఏర్పాటు చేశారు.

మెడికొండ్రు మండలంలో ఏర్పాటు చేసిన 60 బస్సులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 403 మంది, ప్రకాశం జిల్లాకు చెందిన 554 మందిని, గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతానికి చెందిన 1,342 మందిని తరలిస్తున్నారు.

ఫిరంగిపురం మండలంలో ఏర్పాటు చేసిన 2 బస్సుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన 48 మందిని తరలిస్తున్నారు. మొత్తం 3,347 మంది వ్యవసాయ వలస కూలీలను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రైతులను ఆదుకోవాలి: సీపీఐ నేతలు

ABOUT THE AUTHOR

...view details