విద్యా సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 172 అమలైతే 45వేల స్కూళ్లలో 11వేలే మిగిలే అవకాశం ఉందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా 76వేల ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతాయన్నారు.
'జీవో 172తో 33వేల పాఠశాలల మూత'
విద్యా సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 172ను వెెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దీనివల్ల 33వేల పాఠశాలలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు
దీంతో గ్రామాల్లో చదువు మధ్యలో మానేసే వారి సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 172 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 15వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరుకలపూడి ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.
ఇదీ చదవండి:సీఎం ముఖ్య కార్యదర్శి పొలిటికల్ బాధ్యతలు ముత్యాలరాజుకు అప్పగింత