30 లక్షల నిషేధిత గుట్కా పట్టివేత - banned Gutka seezed guntur district
పిడుగురాళ్లలో నిషేధిత గుట్కాను ఆక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 30 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకోని డ్రైవర్ ని అదుపులో తీసుకున్నారు.
![30 లక్షల నిషేధిత గుట్కా పట్టివేత 30 lakhs of banned Gutka seezed at pedguralla guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7577106-336-7577106-1591891720451.jpg)
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి నెల్లూరుకు లారీలో తరలిస్తున్న 300 గుట్కా బస్తాలను పిడుగురాళ్ల పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. గుట్కా, ఖైనీ ప్యాకెట్లు 300 బస్తాలను లారీలో ఎక్కించారు. ఎవరికీ అనుమానం రాకుండా లారీ వెనుకభాగంలో గుట్కా బస్తాలపై తవుడు కట్టలు వేశారు. లారీలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారని పిడుగురాళ్ల సీఐ కె.ప్రభాకరరావుకు సమాచారం రావడంతో సినిమా హాలు సెంటర్ వద్ద సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. గుట్కా ప్యాకెట్ల బస్తాలు స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వాటి విలువ రూ.30 లక్షల దాకా ఉంటుందని సీఐ కె.ప్రభాకరరావు చెప్పారు.