గుంటూరు జిల్లా బాపట్ల మండలం రామచంద్రపురం బీచ్‌లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంకు చెందిన నక్కల రామకృష్ణ(23)కు ఇటీవలే వివాహం జరిగింది. అతను తన స్నేహితులు బ్రహ్మయ్య (23), సురేశ్ (22)లతో కలిసి బాపట్ల సమీపంలోని బీచ్‌కు వెళ్లాడు. వారంతా సముద్రతీరంలో సరదాగా గడిపారు. ఈ క్రమంలో 8 మంది సముద్రంలో స్నానం కోసం దిగారు. నలుగురు మాత్రం ఒడ్డున ఉన్నారు. వారిలో నక్కల రామకృష్ణ కొంచెం లోపలకు వెళ్లాడు. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో.. అతను మునిగిపోయాడు.
Flash: రామచంద్రాపురం తీరంలో విషాదం..ముగ్గురు యువకులు గల్లంతు - రామచంద్రాపురం సముద్రతీరంలో ముగ్గురు యువకులు గల్లంతు
సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు
19:03 July 02
సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు
స్నేహితుడిని కాపాడేందుకు మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఊసా సురేష్, వల్లు బ్రహ్మయ్యలు కూడా గల్లంతయ్యారు. మిగతా వారు ఎలాగొలా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ఠలికి చేరుకున్నారు. స్థానిక గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేదు. దీంతో గాలింపు నిలిపి వేశారు. రామకృష్ణకు ఇటీవలే వివాహం కావడం.. అంతలోనే మరణించటం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి:
Last Updated : Jul 2, 2021, 11:53 PM IST