గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మెడికొండ్రు మండలంలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. వీరితో కలిపి కేసుల సంఖ్య 15కు చేరింది. మెడికొండ్రు సీఐ, పేరేచర్ల లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన ఓ మహిళ, అదే ప్రాంతంలోని మరో వ్యక్తికి కరోనా సోకినట్లు ఆదివారం వైద్య అధికారులు నిర్ధరించారు. వారు నివసించే ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.
తాడికొండ నియోజకవర్గంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ - guntur district latest corona news
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వీరిలో మెడికొండ్రు సీఐ ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి... రసాయనాలు పిచికారి చేయించారు.

మెడికొండు సీఐకు కరోనా పాజిటివ్