అమరావతి మహిళలపై పోలీసు అధికారులు దారుణంగా ప్రవర్తించారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తెనాలి బహిరంగసభలో మాట్లాడిన ఆయన... రాజధాని రైతులు, మహిళలు 49 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. అమరావతి కోసం 25 గుండెలు ఆగినా మీరు స్పందించరా..? అని సర్కారును ప్రశ్నించారు. వరదలు వస్తే అమరావతి మునుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కరోజులోనే 3 జిల్లాలు తిరిగామని జీఎన్ రావు కమిటీ చెప్పింది. అది ఎలా సాధ్యమో అర్థం కావట్లేదని లోకేశ్ అన్నారు.
'అమరావతి కోసం 25 గుండెలు ఆగినా మీరు స్పందించరా..?' - వైకాపాపై లోకేశ్ వ్యాఖ్యలు
అమరావతి కోసం 25 గుండెలు ఆగినా.. మీరు స్పందించరా..? అని ప్రభుత్వాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. రాజధాని రైతులు, మహిళలు 49 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. మహిళలపై పోలీసు అధికారులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
తెనాలి బహిరంగసభలో లోకేశ్