ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కరోనా కలకలం: ఒక్క రోజులో 244 కేసులు నమోదు - ఒక్క రోజులో 244 కేసులు నమోదు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ వణికిస్తున్నాయి. ఒక్కరోజే 244 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2443కు చేరింది.

guntur district
ఒక్క రోజులో 244 కేసులు నమోదు

By

Published : Jul 6, 2020, 10:31 PM IST

గుంటూరో జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ ఒక్కరోజే 244 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2443కు చేరింది. నగరంలో ఏకంగా 142 కేసులు బయటపడ్డాయి. తాడేపల్లి మండలంలో 23, తెనాలిలో 11, పిడుగురాళ్లలో 7, వినుకొండ 3, దాచేపల్లి, సత్తెనపల్లిలో ఐదేసి కేసులు, బొల్లాపల్లిలో 4, దుగ్గిరాల, నరసరావుపేట, మాచర్ల, పెద్దకాకానిలో మూడేసి కేసులు... భట్టిప్రోలు, మంగళగిరి, పిడుగురాళ్ల, పెద్దనందిపాడు, వట్టిచెరుకూరు, చిలకలూరిపేటలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. అమరావతి, అమృతలూరు, అచ్చెంపేట, చేబ్రోలు, దుర్గి, యడ్లపాడు, గుంటూరు రూరల్, కొల్లూరు, క్రోసూరు, మేడికొండూరు, నిజాంపట్నం, ఫిరంగిపురం, రొంపిచర్ల, కొల్లూరు, పెదకాకాని, పొన్నూరు, ప్రత్తిపాడు, తుళ్లూరు, సత్తెనపల్లి, తాడికొండ, వేమూరులో ఒక్కొక్కరికి కరోనా సోకింది.

కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు ఎక్కడికక్కడే శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details