గుంటూరు జిల్లాలో కొత్తగా 22 కంటైన్మెంట్ జోన్లు - గుంటూరు కరోనా వార్తలు
గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 6071కి చేరింది. జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణం తేడా లేకుండా వైరస్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొత్తగా 22 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది జిల్లా యంత్రాంగం.
Containment Zones in Guntur District
By
Published : Jul 22, 2020, 8:02 AM IST
గుంటూరు జిల్లాలో కొత్తగా 22 కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రకటించారు. జిల్లాలో అత్యధికంగా నరసరావుపేట పట్టణంలో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.