గుంటూరు జిల్లాలో కలుషిత ఆహారం తిని 20 మంది ఉపాధి కూలీలు అస్వస్థతకు గురయ్యారు. కొల్లిపొర మండలం తూములూరులోని ఓ హోటల్లో అల్పాహారం తీసుకున్న వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారందరిని కొల్లిపరలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించారు.
బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే మెరుగైన చికిత్స కోసం బాధితులను తెనాలి లేదా గుంటూరు తరలించాలని వైద్యులు సూచించారు. అంబులెన్సుల ద్వారా వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.