ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుంటూరు జిల్లాలో 20 కంటైన్మెంట్ జోన్లు, 59 క్లస్టర్లు' - గుంటూరు జిల్లా కంటైన్మెంట్ జోన్లు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఒక్క డివిజన్​ తప్ప మిగతావన్నీ కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వెల్లడించారు. ప్రజలు లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

20 containment zones and 59 clustures in guntur district, says collector
20 containment zones and 59 clustures in guntur district, says collector

By

Published : May 5, 2020, 5:11 PM IST

మీడియాతో జిల్లా కలెక్టర శామ్యూల్ ఆనంద్

గుంటూరు జిల్లాలో 20 కంటైన్మెంట్ జోన్లు, 59 క్లస్టర్లు ఉన్నాయని కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్ వెల్లడించారు. నగరంలో 26వ డివిజన్‌ మినహా... మిగితావన్ని కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయన్నారు. బఫర్‌ జోన్‌లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి 9 వరకే సమయమిచ్చామని స్పష్టం చేశారు.

మాస్కు లేకుండా బయటకు రావద్దని జిల్లా ప్రజలకు పాలనాధికారి సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి వాహనాలకూ అనుమతి లేదని తేల్చి చెప్పారు. మద్యం దుకాణాల వద్ద జనాలు గుమిగూడితే ఆ దుకాణాలు రద్దు చేస్తామని హెచ్చరిచ్చారు. మందు కోసం పక్క గ్రామాలకు వెళ్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details