గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కరోనా విస్తరణ దృష్ట్యా 18 కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం, లింగారావుపాలెం, మేడికొండూరు మండలంలో కొరపాడు, రొంపిచర్ల మండలంలో కొత్తపల్లి, అలవాల, ముప్పాళ్ల మండలంలో లంకెలకూరపాడు, పెదనందింపాడు మండలంలో పెదనందిపాడు, రేపల్లె మండలంలో నల్లూరివారిపాలెం, యాదవ వీధి, వినుకొండ మండలంలోని ఏబీఎం కాంపౌండ్, చేబ్రోలు మండలంలోని శెలపాడు, వేజండ్ల, అచ్చంపేట మండలంలోని కోనూరు, భట్టిప్రోలు మండలంలోని పెదపులివర్రు, తాడేపల్లి మండలంలోని డోలస్‌నగర్, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శ్రీనివాసరావుతోట, ఎన్జీవోకాలనీ, ఏ.టి.అగ్రహారం ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో కొత్తగా 18 కంటైన్మెంట్ జోన్లు - guntur district latest news
గుంటూరు జిల్లాలో కొత్తగా 18 కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొనసాగుతున్న విజృంభన..
గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసులు 60వేలు దాటాయి. కొత్తగా 342 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 60వేల 95కు చేరుకున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తెనాలి పట్టణంలో 41, గుంటూరు నగరంలో 34 నమోదయ్యాయి. ఇక మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నకరికల్లు 32, నర్సావుపేట 31, చిలకలూరిపేట 29, సత్తెనపల్లి 23, చెరుకుపల్లి 21, అమర్తలూరు 18, తాడేపల్లి 12, రేపల్లె 12, చుండూరు 10 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 79 కేసులు వచ్చాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 53వేల 372 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో తాజాగా గుంటూరు జిల్లాలో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 555 కి చేరింది.
ఇదీ చదవండి