ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

177వ రోజుకు.. అమరావతి రైతుల ఆందోళనలు

అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 177వ రోజుకు చేరుకున్నాయి. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ మహిళలు, రైతులు రాజధాని కోసం పోరాడుతున్నారు. కోర్టులే తమకు న్యాయం చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

177th day of Concerns of Amaravati farmers at amaravathi in guntur district
177@ అమరావతి రైతుల ఆందోళనలు

By

Published : Jun 11, 2020, 4:15 PM IST

మూడు రాజధానులు వద్దు.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నాలు... 177వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తుళ్లూరు, అనంతవరం, మందడం, మల్కాపురం, రాయపూడి, దొండపాడు గ్రామాల్లోని... రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతికి మద్ధతుగా నినాదాలు చేశారు.

వైకాపా ప్రభుత్వం దళిత రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన పెన్షన్, కౌలు డబ్బులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. న్యాయస్థానాలే తమకు న్యాయం చేస్తాయని రైతులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారంతా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details