ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్కాచెల్లెళ్ల ఆందోళన పట్టించుకోని మంత్రి రోజా - ప్లేట్లు, గ్లాసులు చూపిస్తూ అంగన్వాడీల నిరసన - ఎమ్మెల్యే పద్మావతిపై అంగన్వాడీల ఆగ్రహం

15th day Anganwadi's Protest In Andhra Pradesh : పదిహేను రోజులుగా నిరసన దీక్షలతో కొనసాగుతున్న అంగన్వాడీల ధర్నా సెగ వైసీపీ నేతలను తాకింది. విశాఖలో మంత్రి అమర్నాథ్​ను కలిసి అంగన్వాడీలు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే రోజా, జొన్నలగడ్డ పద్మావతి వినతి పత్రం సమర్పించడానికి వచ్చిన తమను పట్టించుకోలేదని అంగన్వాడీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

day_anganwadis_protest_in_andhra_pradesh
day_anganwadis_protest_in_andhra_pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 4:59 PM IST

15th day Anganwadi's Protest In Andhra Pradesh :అంగన్​వాడీ అక్కా చెల్లెళ్లు రోడెక్కి జగనన్న దిగి రావాలి, తమ సమస్యలకు పరిష్కారం చూపాలని నిరసన బాట పట్టి పదిహేను రోజులు గడుస్తున్నా ఫలితం లేకపోయింది. కనీసం స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం తమ ఆందోళనలు కనిపించడం లేదని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు.

అంగన్వాడీతో ప్రభుత్వం మళ్లీ చర్చలు - ఆ రెండు డిమాండ్లపై కార్యకర్తల పట్టు

Anganwadi's Petition to Minister Roja : గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి రోజాకు అంగన్వాడీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రిని అంగన్వాడీలు చుట్టుముట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. కానీ మంత్రి వారిని పట్టించుకోకుండా, వినతిపత్రం తీసుకుకోకుండానే వాహనం ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ అంగన్​వాడీ కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహం వద్ద పళ్లాల, గరిటెలతో నిరసన తెలిపారు. 15 రోజులుగా పోరాడుతుంటే ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు అంటే ఎందుకంత చిన్నచూపు అని మండిపడ్డారు.

'అంగన్వాడీలను పండుగ రోజూ పస్తులు ఉంచిన ఘనత జగన్‌కే దక్కింది'

Anganwadi's Petition to MLA Jonnalagadda Padmavati :15 రోజులుగా దీక్ష చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించలేదని సింగనమల నియోజకవర్గంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగనమలలో ఆడుదాం-ఆంధ్రా ప్రారంభ కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా శిబిరం వద్ద కూర్చున్న అంగన్వాడీలు రోడ్డుపైకు వచ్చారు. తమ సమస్యలను సీఎంకు చెప్పుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్ధృతంగా మారింది. పోలీసులు అంగన్వాడీలను పక్కకు లాగేశారు. అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే కారు ఆపకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపైన పెద్ద ఎత్తున అంగనవాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొవ్వొత్తులతో అంగన్వాడీల నిరసనలు - డిమాండ్లు పరిష్కరించేవరకు వెనక్కు తగ్గబోమని స్పష్టం

Anganwadi's Petition to Minister Gudivada Amarnath :15 రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని విశాఖ గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఇంటి దగ్గర వినతి పత్రం అందజేశారు. చాలీచాలని జీతాలతో అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నామని జీతాలు పెంచాలని కోరారు. తన సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని తెలిపారు.

ఎట్టకేలకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని అంగన్వాడీ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలో సీఐటీయూ, ఐఎఫ్​టీయూ, ఏఐటీయూసీ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు కూడా చర్చలకు హాజరు కావాలని రావాలని ప్రభుత్వం కబురు పంపింది.

హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు

ABOUT THE AUTHOR

...view details