వ్యవసాయ కూలీలతో వెళుతోన్న ట్రాక్టరును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో 15 మందికి గాయాలయ్యాయి. సత్తెనపల్లి మండలం నందిగామ నుంచి వ్యవసాయ కూలీలు మేడికొండూరు బయలుదేరారు. కొర్రపాడు వద్ద ట్రాక్టర్‌ను రిపేరు కోసం పక్కన ఆపారు. అదే సమయంలో పిడుగురాళ్ల నుంచి గుంటూరు వెళుతోన్న ఆర్టీసీ బస్.. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ట్రక్‌లో ఉన్న కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు - కొర్రపాడు వద్ద రోడ్డు ప్రమాదం వార్తలు
గుంటూరు జిల్లాలో వ్యవసాయ కూలీలతో వెళ్తోన్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో 15 మంది గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15మందికి గాయాలు