ap corona cases today: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,650 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా బారి నుంచి తాజాగా 3,969 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258, అనంతపురంలో 1534, గుంటూరు 1458, ప్రకాశం 1399, కర్నూలు 1238, చిత్తూరు 1198, తూర్పుగోదావరి 1012, నెల్లూరు, 1103, కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,542 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు..
Corona cases in India: మరోవైపు భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 3,33,533 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 525 మంది మరణించారు. 2,59,168 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.78 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.18 శాతం నమోదైనట్లు పేర్కొంది.
- మొత్తం కేసులు:3,92,37,264
- మొత్తం మరణాలు:4,89,409
- యాక్టివ్ కేసులు:21,87,205
- మొత్తం కోలుకున్నవారు:3,65,60,650
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 71,10,445 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,61,92,84,270కు చేరింది.
సామాజిక వ్యాప్తి దిశగా..
సార్స్ కోవ్-2 వైరస్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ మన దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్) తెలిపింది. దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్ ప్రబలంగా ఉందని పేర్కొంది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దాని కన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది.
"వ్యాక్సిన్ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు బహిర్గతం కావడంలేదు(అసింప్టమాటిక్). మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, టీకా తీసుకోని హైరిస్కు ఉన్న వ్యక్తుల్లోనూ ఇటువంటి తక్కువ ప్రభావాన్ని చూపుతుందని భావించడం సరికాదు" అని ఇన్ఫాకాగ్ హెచ్చరించింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 27,95,993 మందికి కరోనా సోకింది. 6,356 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 34,97,07,661కి చేరగా.. మరణాలు 56,09,684కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 3,12,314 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 841 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.1 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 3,89,320 కేసులు వెలుగుచూశాయి. మరో 167 మంది చనిపోయారు.
- ఇటలీలో 1,71,263 కొత్త కేసులు బయటపడగా.. 289 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 2,02,466 మందికి వైరస్ సోకగా.. 332 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 98,146 కరోనా కేసులు బయటపడగా.. 134 మంది బలయ్యారు.
- జర్మనీలో 1,05,903 వేల మందికి వైరస్ సోకింది. మరో 104 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 76,807 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 297 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి:
TDP Leaders arrest in Amaravathi : తెదేపా- వైకాపా శ్రేణుల సవాళ్లు...తెలుగు తమ్ముళ్ల అరెస్టులు...