ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 13 జిల్లాల నుంచి వివిధ విభాగాల ఉద్యోగులు, అర్జీదారులతో జగన్ నివాస ప్రాంతం కిటకిటలాడుతోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే కొరుతున్నామని అర్జీదారులు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయుష్, మీ సేవా, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సమన్వయకర్తలు, గ్రామీణ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళనను కొనసాగించారు. గ్రామ సచివాలయాల్లో తమకు అవకాశం కల్పించాలంటూ అనుమతి ఉన్న సర్వేయర్లు, ఫిషరీస్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రిగారూ.... మమ్మల్లి గుర్తించి.. ఉపాధి కల్పించండి....! - జగన్
సీఎం నివాస ప్రాంతం కిటకిటలాడుతుంది. సమస్యలు చెప్పడానికి వచ్చినవారు... ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ న్యాయం చేయమని అడగడానికి వచ్చే వారితో కిక్కిరిసిపోతోంది.

సీఎం నివాస ప్రాంతంలో ధర్నా