అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శం - 123 జయంతి
అల్లూరి సీతారామరాజు 123 జయంతి పురస్కరించుకొని గుంటూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కలెక్టర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ కొనియాడారు.
అల్లూరి సీతారామరాజు తెలుగుజాతి ఆణిముత్యమని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు నాజ్ సెంటర్లో అల్లూరి విగ్రహానికి కలెక్టర్, సంయుక్త కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన మహనీయుడు సీతారామరాడు అని కొనియాడారు. అతి చిన్న వయస్సులో స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొని నేటి యువతకు ఆదర్శనీయుడు అయ్యారన్నారు. ఆయన స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.