గుంటూరు జిల్లా వినుకొండ మండలం చట్రగడ్డపాడులోని నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. గుండ్లకమ్మ వాగు ఒడ్డున 1200లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకయ్యను నిందితునిగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు.
చట్రగడ్డపాడులో 1200లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
గుంటూరు జిల్లాలో నాటుసారా తయారీ స్థావరాలపై అధికారులు దాడులు చేపట్టారు. 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుడు పరారైనట్లు తెలిపారు.
బెల్లం ఊట ధ్వంసం