గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణం కిటికీ పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగ 1200 మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు. సమచారం అందుకున్న క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజీ చూశారు. 20 ఏళ్ల యువకుడు ముసుగు ధరించి, ముఖానికి మాస్క్ వేసుకుని, చేతులకు గ్లౌజ్లతో లోపలికి వచ్చినట్లు గుర్తించారు. జిల్లాలో కొల్లిపర, అమరావతిలోనూ ఇదే తరహాలో దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చోరీకు గురైన మద్యం విలువ రూ. 2.36 లక్షలు అపహరణకు గురైనట్లు వెల్లడించారు.
మంగళగిరి మద్యం దుకాణంలో చోరీ..1200 బాటిళ్లు ఎత్తుకెళ్లిన దొంగ - robbery at mangalagiri wine shop
మంగళగిరి ప్రభుత్వం మద్యం దుకాణంలో 1200 మద్యం సీసాలను ఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఇదే తరహా దోపిడీ కొల్లిపర, అమరావతిలో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన క్లూస్ టీం