ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీకి పాల్పడి రూ.80 వేల విలువైన 111 మద్యం సీసాలను దోచుకున్న ఘటన గుంటూరు జిల్లా జగడగుంట పాలెంలో జరిగింది. దుకాణం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల దోపిడీ దారులకు కలిసొచ్చిందని స్థానిక ఎస్​ఐ మురళి పేర్కొన్నారు. ప్రతి మద్యం షాపు వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.

By

Published : May 9, 2020, 12:11 AM IST

ప్రభుత్వ మద్యం దుకాణంలో 111 మద్యం సీసాలు చోరీ
ప్రభుత్వ మద్యం దుకాణంలో 111 మద్యం సీసాలు చోరీ

గుంటూరు జిల్లా తెనాలి మండలం జగడగుంట పాలెంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తాళాలు పగులగొట్టి అందులోని 111 మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.80 వేలు ఉంటుందని స్థానిక ఎస్​ఐ మురళి తెలిపారు. షాపులోని బీరువాలో ఉన్న రూ.5 లక్షల డబ్బులు మాత్రం ముట్టుకోలేదని... ఇది కేవలం మద్యం కోసం అలవాటుపడిన వారే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుకాణం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల దోపిడీ దారులకు కలిసొచ్చిందని చెప్పారు. ప్రతి మద్యం షాపు వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. దుకాణం సూపర్​వైజర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చూడండి:సీసీటీవీపై టవల్​ కప్పి... మద్యం దోచుకెళ్లారు!

ABOUT THE AUTHOR

...view details