గుంటూరు జిల్లా తాడేపల్లిలో 11 మంది కరోనా అనుమానితులను అధికారులు గుర్తించారు. వారి ఇళ్లల్లోనే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి ఆశా వర్కర్లు ద్వారా చికిత్స అందిస్తున్నారు. వీరిని 14 రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. గత కొన్ని రోజులగా విదేశాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్న వారిలో దుబాయ్, ఇటలీ నుంచి 2, నేపాల్ నుంచి 3, సౌదీ, ఇజ్రాయెల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికా నుంచి ఒక్కో వ్యక్తి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరి నమూనాలు సేకరించిన వైద్య అధికారులు పరీక్షల నిమిత్తం పుణె పంపించారు.
గుంటూరు జిల్లాలో 11 మంది కరోనా అనుమానితులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 11 మంది కరోనా అనుమానితులను గుర్తించారు. 15 రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించిన అధికారులు వారికి ఇళ్లల్లోనే చికిత్స అందిస్తున్నారు. ఇంట్లోనే ఐసోలేషన్ గది ఏర్పాటు చేసి ఆశా వర్కర్ల ద్వారా చికిత్స అందిస్తున్నారు.
11 suspected karona victims in recognized in guntur dst