ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్​ఫోన్ వాడొద్దని తల్లి చెబితే.. ఆత్మహత్య చేసుకున్నాడు! - గుంటూరు సెల్​ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి వార్తలు

సెల్​ఫోన్ ఎక్కువగా వాడొద్దు.. మంచిది కాదురా.. నాయనా! అని చెప్పింది ఓ తల్లి. ఆ మాటలు బాధించడంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

సెల్​ఫోన్ వాడొద్దని తల్లి చెబితే.. ఆత్మహత్య చేసుకున్నాడు!
సెల్​ఫోన్ వాడొద్దని తల్లి చెబితే.. ఆత్మహత్య చేసుకున్నాడు!

By

Published : Nov 30, 2020, 4:25 PM IST

సెల్ ఫోన్ వాడొద్దు అని తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడులో రెడ్డి పురందేశ్వర్(15) వట్టిచెరుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని పురందేశ్వర్​ను తల్లి మందలించింది. మనస్తాపం చెందిన బాలుడు గడ్డి మందు తాగాడు. గమనించిన తల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. పురందేశ్వర్​ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details