రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 108వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాలైన తుళ్లూరు, మందడం, రాయపూడి, దొండపాడు, వెంకటపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం పెదపరిమిలో పోరాటాన్ని అక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మందడంలో చిన్నారులు మోకాళ్లపై నిలుచున్నారు. నీరుకొండలో రైతులు నిరసన తెలిపారు. నేలపాడులో రైతులు ఇళ్ల వద్దే సామాజిక దూరం పాటిస్తూ దీక్ష చేశారు.
108వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్ష - amaravathi moment in corona lockdown
అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 108వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరులో సామాజిక దూరం పాటిస్తూ పోరాటాన్ని కొనసాగించారు.
108వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్ష