ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం హామీ ఇచ్చారు.. 108 సిబ్బంది సమ్మె విరమించారు - 108 ఉద్యోగులు

108 అంబులెన్స్​ల సిబ్బంది సమ్మె విరమించారు. తమ సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అందుకే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

జగన్ హామీతో సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

By

Published : Jul 25, 2019, 11:09 PM IST

జగన్ హామీతో సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

రోగుల కష్టాలు తీరాయి. 108 అంబులెన్స్​ల సిబ్బంది సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి జగన్ హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తక్షణం విధులకు హాజరవుతామని తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పిన 108 ఉద్యోగులు... ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 31లోగా వేతన బకాయిలు చెల్లించేందుకు అంగీకరించారు. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని తెలిపిన సీఎం... వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details