ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

100 Kilometers Cycling Every Day Bandlamudi Subbaiah in Guntur: 56 ఏళ్ల వయసులో లక్ష కిలోమీటర్ల సైక్లింగ్‌ పూర్తి.. యువతకు ఆదర్శం - ప్రతిరోజు 100 కిమీ చొప్పున 710 సార్లు సెంచరీలు

100 Kilometers Cycling Every Day Bandlamudi Subbaiah in Guntur: ఆధునిక సమాజంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ.. శారీరకంగా, మానసికంగా అనేక సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నారు.. వ్యాయామం, ఆటలకు దూరం కావడంతో చిన్నవయసులోనే రోగాల బారిన పడుతున్నారు. ఇదే ఇబ్బందిని గుంటూరుకు చెందిన బండ్లమూడి సుబ్బయ్య చవిచూశారు. 56 ఏళ్ల వయసులో అధిక బరువు సమస్యను అధిగమించమే కాకుండా.. సైక్లింగ్‌లో పలు పతకాలు సాధించి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

100_Kilometers_Cycling_Every_Day_Bandlamudi_Subbaiah_in_Guntur
100_Kilometers_Cycling_Every_Day_Bandlamudi_Subbaiah_in_Guntur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 11:59 AM IST

Updated : Sep 6, 2023, 1:25 PM IST

100 Kilometers Cycling Every Day Bandlamudi Subbaiah in Guntur: 56 ఏళ్ల వయసులో లక్ష కిలోమీటర్ల సైక్లింగ్‌ పూర్తి.. యువతకు ఆదర్శం

100 Kilometers Cycling Every Day Bandlamudi Subbaiah in Guntur :మన చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉన్నా.. మేము బాగుండాలి అనుకునేవారు కొందరైతే.. మన ఆరోగ్యంతో పాటు మన పరిసరాలు, పర్యావరణం కూడా బాగుండాలనుకునే వారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే.. గుంటూరుకు చెందిన బండ్లమూడి సుబ్బయ్య. నిత్యం 100 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తూ.. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా.. పర్యావరణాన్ని రక్షించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అతి తక్కువ వ్యవధిలోనే లక్ష కిలోమీటర్లు సైక్లింగ్ చేసి.. నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు..ఈ 56 ఏళ్ల (Cycling at the Age of 56) క్రీడాకారుడు.

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడికి చిత్తవుతున్న ఆధునిక తరం...లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమమవుతోంది. కనీస వ్యాయామం లేకపోవడం, ఆటలకు దూరం కావడం మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు శారీరకంగా, మానసికంగా అనేక సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇదే ఇబ్బందిని చవిచూసిన గుంటూరు నగరానికి చెందిన బండ్లమూడి సుబ్బయ్య... తన అధిక బరువు సమస్యను అధిగమించేందుకు స్విమ్మింగ్, సైక్లింగ్ దృష్టిపెట్టారు. కొవిడ్ సమయంలో స్విమ్మింగ్ చేసే అవకాశం లేకపోవడంతో పూర్తి స్థాయిలో సైక్లింగ్ చేయడం మెుదలుపెట్టారు. అలా ఆరంభమైన సుబ్బయ్య సైక్లింగ్ ప్రస్థానం నాటి నుంచి నేటి వరకూ నిరంతరాయంగా కొనసాగుతోంది.

సైకిల్ తొక్కండి.. ఫిట్​నెస్ పొందండి! సైకిల్​పై దేశాన్ని చుట్టేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడు

అయిదు పదుల వయసు దాటిన సుబ్బయ్య దినచర్య ప్రతి రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు సైక్లింగ్​తోనే మెుదలవుతోంది. నాలుగు గంటల నుంచి 8.30 గంటల మధ్య గుంటూరు నగరంలో పదుల కిలోమీటర్లు సైక్లింగ్‌ చేయడం బండ్లమూడి సుబ్బయ్య అలవాటుగా మార్చుకున్నారు. 2020 ఆగస్టు 2న మొదటిసారి వంద కిలోమీటర్ల రైడ్‌ను పూర్తి చేశారు. ప్రతిరోజూ 100 కిలోమీటర్ల చొప్పున 710 సార్లు సెంచరీలు చేశారు. రోజూ 50 కిలోమీటర్ల చొప్పున 240 సార్లు అర్ధసెంచరీలను తన ఖాతాలో వేసుకున్నారు.

Bandlamudi Subbaiah Cycled One Lakh Kilometers at the Age of 56 :అడాక్స్‌ నిర్వహించే 200, 300, 400, 600 కిలోమీటర్లు పూర్తిచేసి సూపర్‌ రాండోనియర్‌ టైటిల్‌ సాధించారు. సూపర్ రాండోనియర్ టైటిల్​ని ఇంత తక్కువ వ్యవధిలో ఎవరూ సాధించలేదు. ట్రక్‌, ముంబయ్‌, కోల్‌కతా, సహస్ర, సైక్లింగ్‌ ఐపీఎల్‌, టూర్‌డీ -100 వంటి సంస్థలు నిర్వహించిన సైక్లింగ్‌ పోటీల్లో పతకాలు, ట్రోఫీలు సుబ్బయ్య గెలుచుకున్నారు. అలాగే సైక్లింగ్‌ ప్రక్రిలో అనేక మైలురాళ్లు అధిగమించిన ఆయన ఇటీవలే లక్ష కిలోమీటర్ల సైక్లింగ్‌ను పూర్తి చేశారు.

సోలోగా 25వేల కి.మీ సైకిల్​ యాత్ర.. ఆ విషయం ప్రూవ్ చేసేందుకు ఆశ సాహసం

నిత్యం సైకిల్ తొక్కటం వల్ల షుగర్, బీపీ, ఊబకాయం వంటి అన్నిరకాల దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు దూరం కావచ్చంటున్నారు బండ్లమూడి సుబ్బయ్య. సైక్లింగ్ అనేది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గత నవంబర్ లో చేపట్టిన కశ్మీర్‌ టు కన్యాకుమారి సైకిల్‌యాత్రలోనూ ఆయన పాలుపంచుకున్నారు. శ్రీనగర్‌ నుంచి రాంబాన్‌, పటాన్‌కోట్‌, జలంధర్‌, దిల్లీ, మధుర, గ్వాలియర్‌, నాగపూర్‌, హైదరాబాద్‌, కర్నూల్‌, అనంతపురం, బెంగళూరు మీదుగా కన్యాకుమారి వరకు 3,700 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. ఈ యాత్ర తనకు కొత్త అనుభవాల్ని, అనుభూతుల్ని మిగిల్చిందని తెలిపారు.

సైక్లింగ్​తో పాటు స్విమ్మింగ్​లోనూ బండ్లమూడి సుబ్బయ్య అనేక పతకాలు సొంతం చేసుకున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో 30కు పైగా పతకాలు సాధించి ఉత్తమ స్విమ్మర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే.. కచ్చితంగా వ్యాయామం, యోగా, సైక్లింగ్‌, స్విమ్మింగ్ లాంటి మంచి అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని బండ్లమూడి సుబ్బయ్య సూచిస్తున్నారు.

సైకిల్​పై 18 వేల కిలోమీటర్లు.... గిన్నిస్ రికార్డుకు చేరువలో తెలుగమ్మాయి!

Last Updated : Sep 6, 2023, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details