10 new liquor brands in AP: విపక్ష నేత హోదాలోనూ, ఎన్నికల్లో గెలిచిన వెంటనే దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామంటూ ప్రకటించిన సీఎం జగన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రకరకాల పేర్లతో కొత్త కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారు. అవి సరిపోవన్నట్లుగా కొత్తగా మరో 10 బ్రాండ్లకు ఏపీఎస్‌బీసీఎల్ తాజాగా అనుమతులిచ్చింది. అదే కేటగిరీలోని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు వీటికి అవకాశం కల్పించింది.
దశలవారిగా నిషేధం కాదు.. కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లకు అనుమతులు - ఏపీఎస్‌బీసీఎల్
New liquor brands: దశలవారీ నిషేధం హామీని గాలికొదిలేసిన వైకాపా సర్కారు.. రాష్ట్రంలో కొత్తగా 10 మద్యం బ్రాండ్లకు అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే రకరకాల పేర్లతో కొత్త కొత్త మద్యం బ్రాండ్లు మార్కేట్లోకి తీసుకురాగా.. మరి కొన్ని కొత్తరకం బ్రాండ్లు రానున్నాయి. కొత్తగా వచ్చే వాటిని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త బ్రాండ్లు, వాటి ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ నోరు విప్పక పోవడంతో పలు ఆనుమానాలకు తావిస్తోంది.
ప్రస్తుతం అమ్ముతున్న మద్యాన్నే అవే కంపెనీలు రేటు పెంచుకునేందుకు కొత్త బ్రాండ్ల రూపంలో తెరపైకి తీసుకొచ్చి అనుమతులు పొందాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు వాసులకు చెందిన ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లకు అనుమతిచ్చారు. దొడ్డిదారిలో మద్యం ధరలు పెంచుకునేందుకు, మందు బాబులను దోపిడీ చేయటానికే ఈ బ్రాండ్లకు అనుమతులిచ్చారన్న విమర్శలున్నాయి. కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ నోరు విప్పట్లేదు.
ఇవీ చదవండి