జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం సౌపాడు నుంచి పొన్నూరుకు అక్రమంగా రేషన్ బియ్య తరలిస్తున్నారని ఓ లారీని రక్షక దళం సభ్యులు పట్టుకున్నారు. రక్షక దళం సభ్యులతో లారీకి సంబంధించిన వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. బియ్యానికి సంబంధించి తొలుత కాగితాలు లేవని లారీని స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అప్పటికప్పుడు కాగితాలు చూపించారంటూ 80 బస్తాలు ఉన్న రేషన్ బియ్యం లారీని పోలీసులు వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం లారీలో బియ్యం పరిశీలించకుండా, రెవెన్యూశాఖ అధికారులు చూడకుండానే లారీని పోలీసులు వదిలేయడం ఏమిటని రక్షక దళం సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లారీని విడిచిపెట్టడంపై రక్షక దళం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.లక్ష దాకా ఉంటుందన్నారు. గుంటూరుకు చెందిన మాదాల నరసింహమూర్తి, ఏల్చూరి అప్పారావులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరి లారీలు సీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.