ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోళ్ల మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి'

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 10 నాటు కోళ్లు ఒకేసారి మృతి చెందాయి. దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న కారణంగా పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల మృతికి గల కారణాలు అన్వేషించాలని స్థానికులు కోరుతున్నారు.

hens died
కోళ్ల మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి

By

Published : Jan 25, 2021, 10:21 AM IST

చిలకలూరిపేట పట్టణం మద్ది నగర్ లో బిలాల్ అనే వ్యక్తి పెంచుకుంటున్న 10 నాటు కోళ్లు ఒకేసారి మృతి చెందాయి. బోనులో ఉంచిన కోళ్లను బయటకు వదిలేందుకు వెళ్లగా అప్పటికే అవి మృతి చెంది ఉండటాన్ని గమనించి ఆందోళన చెందాడు.

ఇన్ని కోళ్లు ఒకే సారి మరణించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి.. కోళ్లను పరిశీలించాలని.. తమ అనుమానాలను నివృత్తి చేయాలని అక్కడి ప్రజలుు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details