సంక్షేమం.. అభివృద్ధి... ఆ విధంగా ఎన్నికలకు.. ! - undefined
మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో రూపొందుతోంది. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛను, మహిళలకు 55 సంవత్సరాలకు ఫించను వంటి అంశాలతో పాటు యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రత్యేక యువజన విధానం రూపకల్పనకు, తెదేపా మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలు చేయనుంది.
యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో రూపొందుతోంది. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛను, మహిళలకు 55 సంవత్సరాలకు ఫించను వంటి అంశాలతో పాటుయువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రత్యేక యువజన విధానం రూపకల్పనకుతెదేపా మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలు చేయనుంది.
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన తెదేపా మేనిఫెస్టో కమిటీ అమరావతి ప్రజావేదికలోఇవాళసమావేశం కానుంది.చంద్రన్న పెళ్లికానుక పథకం లబ్ధిదారులకు సంబంధిత చెక్‌తో పాటు, ఆ నూతన దంపతులకుఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు పత్రాలు, గ్యాస్ కనెక్షన్.. వంటివన్నీ పెళ్లిపీటల మీదే అందజేసేలా మేనిఫెస్టోలోరూపొందించనున్నారు.ఇందుకోసం కమిటీ వివిధ రంగాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. మరో ఒకటి రెండు సమావేశాల తర్వాత ఎన్నికల ప్రణాళికకు కమిటీ తుదిరూపు ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన అనంతరంఖరారు చేయనున్నారు.
TAGGED:
తెదేపా మేనిఫెస్టో కమిటీ