తెదేపా పార్లమెంటరీ సమావేశఁ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం రేపు దిల్లీలో చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షపై చర్చించేందుకు సుజనా చౌదరి నేతృత్వంలో తెదేపా ఎంపీలు పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై ఏపీ భవన్ అధికారులకు పలు సూచనలు చేశారు. దీక్షకు హాజరయ్యే జాతీయ నాయకులందరితో సమన్వయం చేయనున్నట్లు ఎంపీలు తెలిపారు.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన మంత్రులు , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఏపీభవన్ కు చేరుకుంటున్నారు. ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లపై మంత్రులు నక్కా ఆనంద్ బాబు, జవహర్, కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షలు నిర్వహించారు.