ప్రతీ బడ్జెట్లోనూ ఏపీకి మొండి చేయి విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్నివిమర్శించారు. ఐదేళ్లుగా ప్రత్యేక హోదా కోరతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రతి బడ్జెట్లోనూ మోదీ సర్కారు, ఏపీకి మొండి చేయి చూపిందని విమర్శించారు. ఓటాన్ అకౌంట్ పేరుతో పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అనేక పథకాలు ప్రకటించారని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఆందోళన చేయాల్సిన అవసరమే లేదన్నారు. రైల్వే జోన్ విషయంలో కేంద్రానికి వచ్చిన సమస్య ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉండి, ఏపీ సీఎం చంద్రబాబు పై విమర్శలు సరికావన్నారు. కేంద్రంలో మోదీ పాలన ప్రజాస్వామ్య బద్ధంగా సాగడం లేదన్నారు.