ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"కేరళ మత్స్యకారులకు నోబెల్ శాంతి బహుమతి"

కేరళ వరదల సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న మత్స్యకారులకు నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కోరారు.

By

Published : Feb 7, 2019, 9:06 AM IST

శశి థరూర్

శశి థరూర్
కేరళ వరదల సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న మత్స్యకారులకు నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కోరారు.

2018 కేరళ వరదల్లో చిక్కుకున్న అనేకమంది ప్రాణాలు కాపాడిన మత్స్యకారులకు నోబెల్‌ శాంతి బహుమతి అందించాలని నోబెల్ కమిటీకి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ లేఖ రాశారు. వరదల సమయంలో, అనంతరం సహాయక కార్యక్రమాల్లోనూ కేరళ మత్స్యకారులు కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. వారు నోబెల్​కు అర్హులని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్​ను థరూర్​ కోరారు.

"కేరళ వరదల సమయంలో మత్స్యకారులు ప్రముఖ పాత్ర పోషించారు. వారి ఇళ్లు, పడవలు ధ్వంసమైనా ప్రాణాలను పణంగా పెట్టి బాధితులను కాపాడారు. ఓ వృద్ధున్ని పడవలోకి ఎక్కించడానికి మత్స్యకారుడు నీటిలో పడుకొని సహాయపడిన తీరు వారి గొప్పదనాన్ని వెల్లడిస్తోంది. సహాయక కార్యక్రమాల్లోనూ మత్స్యకారులు కీలకంగా వ్యవహరించారు. నోబెల్​ శాంతికి వారు అర్హులు."

-శశిథరూర్, ఎంపీ

2018 ఆగస్టులో నైరుతి రుతుపవనాలతో కేరళలో భారీ వర్షాలు కురిశాయి. వరదలతో కేరళ పూర్తిగా ధ్వంసమైంది. ఈ విపత్తులో సుమారు 488 మంది మరణించారు.

శశి థరూర్

ABOUT THE AUTHOR

...view details