రేపటి నుంచే 'ఇంటర్'
ఇంటర్మీడియట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి జరగనున్నాయి. మార్చి 10 తో ముగియనున్న ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రేపే ప్రారంభం కానున్నాయి. మార్చి 10తో ముగియనున్న ఈ పరీక్షలకు 10 లక్షల 17 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 1, 430 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు.. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 113 కేంద్రాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని, కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులుకు ఏవైనా సమస్యలు ఉంటే కాల్ సెంటర్ నెం: 08662974130, టోల్ ఫ్రీ నెంబర్: 18002749868 లో సంప్రదించవచ్చన్నారు.