సీమలో గవర్నర్ పర్యటన - kurnool
కర్నూలు, కడపలో గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా పర్యటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి.. కర్నూలు, కడప జిల్లాల్లోపర్యటించనున్నారు. ఫిబ్రవరి 26 నుంచి 28వరకు జరిగే పర్యటనపై అధికారులకు సమాచారం అందింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి కడప చేరుకుంటారు . కడప నుంచి కర్నూలు జిల్లా రుద్రవరం చేరుకుని ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. అహోబిళం లక్ష్మీనరసింహ స్వామి, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయాలను గవర్నన్ దంపతులు దర్శించనున్నారు. 28వ తేదీ ఉదయం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.