ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగాల్ వాసికి ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం.! - ఫాదర్ ఫ్రాంకోయిస్​ లాబోర్డే

పశ్చిమ్​బంగ నివాసి క్రైస్తవ మిషనరీ ఫాదర్​ ఫ్రాంకోయిస్​ లాబోర్డేకు ఫ్రాన్స్​ అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించారు.

ఫ్రాంకోయిస్​ లాబోర్డేకు ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం లీజియన్​ డీ ఆనర్

By

Published : Feb 7, 2019, 8:56 AM IST

ఫ్రాన్స్​ పౌర పురస్కారం పశ్చిమబంగ వాసిని వరించింది. బంగాల్​కు చెందిన క్రైస్తవ మిషనరీ ఫాదర్​ ఫ్రాంకోయిస్​ లాబోర్డేను ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం లీజియన్​ డీ ఆనర్​కు ఎంపిక చేసినట్లు ఆ దేశం ప్రకటించింది. భారత్​లో ఫ్రాన్స్​ అంబాసిడర్​ అలెగ్జాండ్రే జీగ్లర్​ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

దివ్యాంగులు, నిరుపేదల అభ్యున్నతికి ఫ్రాంక్​ చేసిన సేవల్ని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు ఫ్రాన్స్​ ప్రతినిధి.

"దివ్యాంగుల అభ్యున్నతికి ఆయన 60 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. 92 ఏళ్ల వయసులోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత"-అలెగ్జాండ్రే జీగ్లర్​, ఫ్రాన్స్​ అంబాసిడర్.

ఆయన పనిచేసే చోటనున్న చిన్నారులకు ఆ పురస్కారాన్ని అంకితమిచ్చారు ఫ్రాంక్. గతంలో ఫ్రాన్స్​ పౌరుడే అయినప్పటికీ భారత్​కు మిషన్​ సేవల కోసం వచ్చిన తర్వాత భారత పౌరసత్వం పొందారు.

ఫిల్మ్ మేకర్ సత్యజిత్​ రే, నటుడు సౌమిత్ర ఛటర్జీ తర్వాత ఫ్రాన్స్​ పౌర పురస్కారాన్ని పొందిన భారతీయుడు ఫ్రాంక్.

ABOUT THE AUTHOR

...view details