కృష్ణా జిల్లా తెదేపా నేతలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాకు చేసిన అభివద్ధే గెలుపు తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో 11 అసెంబ్లీ స్థానాలు గెలిచామన్న సీఎం...ఈ దఫా 16 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని నేతలకు సూచించారు. అంతర్గత కలహాలను విడిచి పెట్టి కలసికట్టుగా పనిచేయాలన్నారు. జిల్లాకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం కావాలని సూచించారు.
"కృష్ణాలో గెలుపు ఏకపక్షం" - andhrapradesh
కృష్ణా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. తెదేపా ప్రవేశపెట్టిన అభివృద్ధి పెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ..గెలుపును ఏకపక్షం చేయాలన్నారు.
krishna district
వైకాపావి కుట్ర రాజకీయాలు:
గెలుపుపై భయంతోనే వైకాపా కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు సర్వేల పేరుతో నిజమైన సర్వేలు చేసేవారిని అడ్డుకుంటోందన్నారు . దొంగ ఓట్లు వారే చేర్చి తిరిగి నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా, తెరాస, భాజపా కుట్రలను ప్రజలే చిత్తు చేస్తారని స్పష్టం చేశారు.