'పనితీరుకు పట్టం' - ఆంధ్రప్రదేశ్ శాసనసభ
నాలుగేళ్లలో ప్రభుత్వ పనితీరుకు వచ్చిన అవార్డులతో శాననసభ ప్రాంగణంలో గ్యాలరీని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం అందరి సమిష్టి కృషి వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు.
!['పనితీరుకు పట్టం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2375045-754-91dda72f-dec7-4527-8a57-2296d9c35cd9.jpg)
శాసనసభ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వశాఖలకు కేంద్రం ఇచ్చిన అవార్డులతో అధికారులు ప్రత్యేక గ్యాలరీతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు 670 అవార్డులు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసి సమిష్టిగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించాని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావటంతో ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ అవార్డులే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ఐదేళ్లలో ఏం సాధించామో ప్రజలకు చెప్పేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.