ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనారిటీ, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ ఊతం - బడ్జెట్ 2019-20

ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్​లో చంద్రన్న ప్రభుత్వ కానుకల జల్లు కురిపించింది. మైనారిటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి భారీ కేటాయింపులు ప్రకటించింది.

బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి యనమల

By

Published : Feb 5, 2019, 2:46 PM IST

Updated : Feb 5, 2019, 3:39 PM IST

బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి యనమల
2019-20 ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్​ను ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా పదకొండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల రాష్ట్రా ఆదాయ-వ్యయాలపై ప్రసంగం చేశారు. హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనను తట్టుకొని ఏపీని సంక్షేమ పథంలో నడిపించిన ఘనత చంద్రన్న ప్రభుత్వానిదని ప్రకటించారు. తాత్కాలిక పద్దును గతేడాది కన్నా 18.38 శాతం పెంపుతో 2,26,177.53 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు.
బడ్జెట్ ప్రతిపాదనలో పంచాయతీ రాజ్ - గ్రామీణాభివృద్ధి, మైనారిటీల సంక్షేమ కేటాయింపులను భారీగా పెంచారు.

2019-20 బడ్జెట్ కేటాయింపులు

⦁ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ.35,182.61 కోట్లు
⦁ మైనారిటీ సంక్షేమానికి రూ.1304.73 కోట్లు
గ్రామీణాభివృద్ధి, మైనారిటీ సంక్షేమానికి గతేడాది కన్నా వరుసగా 18.77, 50.10 శాతాల పెంపుతో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు.

మైనారిటీల సంక్షేమం

మైనారిటీల సంక్షేమానికి తెదేపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని యనమల తెలిపారు. విజయవాడ, కడప పట్టణాలలో హజ్ హౌస్​ల నిర్మాణాలు చేపడుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. చర్చిల నిర్మాణం, రిపేర్లు, పునర్నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. విదేశీ విద్యాపథకం మైనారిటీలకూ అమలుపరుస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. ఆదాయ వనరులు లేని మసీదుల ఇమాంలకు నెలకు రూ.5 వేలు, మౌజర్లకు రూ. 3 వేలు పారితోషకం అందిస్తామన్నారు. దుల్హాన్ పథకానికి రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు మంత్రి యనమల.

పంచాయతీ రాజ్- గ్రామీణాభివృద్ధి

మహాత్మగాంధీ జాతీయ ఉపాధి పథకం కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఉపాధి నిధులను 24 ప్రభుత్వ శాఖలకు అనుసంధానిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాథమిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కృషి చేస్తామని యనమల పేర్కొన్నారు. పంట సంజీవని, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, చంద్రబాట, ఘన వ్యర్థాల నిర్వహణ, అంగన్ వాడీ కేంద్రాలు, డిబియం రోడ్ల నిర్మాణ పథకాలను మరింత సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు.

Last Updated : Feb 5, 2019, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details