ETV Bharat / state
'అడ్వాణీ కన్నీళ్లను అడగండి...' - విభజన హామీలు
ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు లేఖ రాశారు.
మోదీకి, సీఎం చంద్రబాబు లేఖ
By
Published : Feb 11, 2019, 3:03 AM IST
| Updated : Feb 11, 2019, 8:27 AM IST
'అడ్వాణీ కన్నీళ్లను అడగండి...' 'అడ్వాణీ కన్నీళ్లను అడగండి...' ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు లేఖ రాశారు. దిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు సంబంధించి 5 పేజీల లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని హితవు పలికారు. ఎక్కడ అడుగుపెడితే అక్కడ నిరసనలు ఎదుర్కొనే పరిస్థితి ప్రధాని స్థాయిలో ఉండే వ్యక్తికి కలుగరాదని అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా నిరసనలు ఎదుర్కోవడం మోదీ 5ఏళ్ల పాలను నిలువెత్తు నిదర్శమని ఆక్షేపించారు. రాబోయే ఓటమిని ఎదుర్కోగల గుండె దిటవు మోదీకి పెరగాలని దేవుడిని ప్రార్థించారు. మోదీ ప్రస్తుత పరిస్థితికి సానుభూతి చూపడం తప్ప తాము చేయగలిగిందేమి లేదని స్పష్టం చేశారు.మోదీకి, సీఎం చంద్రబాబు ఘాటు లేఖ గుంటూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మాటల్లో తన పట్ల కక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఉన్న అక్కసు కనిపిస్తోందని సీఎం చంద్రబాబు, లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల మోదీకున్న చిత్తశుద్ది ఏమిటో, కాకినాడ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం కాంప్లెక్స్‌కు ఐఆర్‌ఆర్‌లోనే తెలిసిపోయిందన్నారు. రాజస్థాన్‌కు ఒకరకంగా, ఏపికి ఇంకోరకంగా చేయడం ఏపీకి ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. మోదీకి, సీఎం చంద్రబాబు ఘాటు లేఖ
Last Updated : Feb 11, 2019, 8:27 AM IST