బీసీ సబ్ ప్లాన్ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరాలు, అధికారిక సవరణల మధ్య బీసీ ఉప ప్రణాళిక బిల్లుకు గురువారం రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర బడ్జెట్లో మూడో వంతు నిధులు కేటాయింపు ప్రాతిపదికన బీసీ ప్రణాళిక కు శాసనసభ ఆమోదాన్ని తెలియజేసింది. ఈ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు సబ్ ప్లాన్‌లోని నిధులు రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా? జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారా ? అని శాసనసభ సభ్యులు కూన రవికుమార్, గొల్లపల్లి సూర్యరావులు ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన ఉంటుందని చెప్పిన మంత్రి సమాధానం పట్ల ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు చొరవతో బిల్లులో కొన్ని సవరణల అనంతరం శాసనసభ ఆమోదించింది.