ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు
కొత్త ఫిట్మెంట్ అమలుకు ఉత్తర్వుల జారీ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ఉద్యోగులు, యాజమాన్యం మధ్య చర్చలు సఫలమయ్యాయి. వాటికి అనుగుణంగానే కార్మికులకు పెంచిన 25శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ సంస్థ ఎండీ సురేంద్ర బాబు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీసు ఆధారంగా రూ.10వేల నుంచి రూ. 25 వేల వరకూ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. 2017 ఏప్రిల్ 1 నాటికి ఉన్న బేసిక్ పే పై 25 శాతం ఫిట్మెంట్, 31.1 శాతం డీఏతో కలిపి కొత్త స్కేలును పరిగణన చేయనున్నారు. శ్రామిక్ పోస్టు పేరును అసిస్టెంట్ మెకానిక్ గా ఏపీఎస్ఆర్టీసీ పేరు మార్చింది. తమ డిమాండ్లు నేరవేర్చిన యాజమాన్యానికి.. ఈయూ, ఐకాస నేతలు కృతజ్ఞతలు తెలిపారు.