చిన్న పరిశ్రమలకు పెద్ద అండ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2019- 20 మధ్యంతర బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారు. ఈ రంగానికి ప్రత్యేకంగా 1000 కోట్లిచ్చారు. వాటిలో 100 కోట్లు ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎమ్ఈ ల పునరుద్ధరణకు ఖర్చు చేయనున్నారు. కొత్త సంస్థలకు ప్రోత్సాహకాలుగా 400 కోట్లిచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి 500 కోట్లు కేటాయించారు. ఆదాయ కల్పనలో, ఉపాధి లో ఎంఎస్ఎమ్ఈ లో పాత్ర ఎంతో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. పెద్ద పరిశ్రమల కంటే 10 రెట్లు అధికంగా ఉధినిస్తున్నాయన్నారు. 2014 నుంచి ఈ రంగంలో 3.3 లక్షల మంది ఉపాధి పొందారని తెలిపారు.