YCP MP Birthday celebrations in temple : అభిమాన నాయకుడి పుట్టిన రోజు వేడుక అంటే కార్యకర్తలకు సంబరమే. తమ నాయకుడి పుట్టిన రోజున అలయాల్లో అర్చనలు, పూజలు, అభిషేకాలు చేయించడం పరిపాటే. కేకులు కట్ చేయడం, ఆశ్రమాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంచడం కూడా చేస్తుంటారు. ఆయా కార్యక్రమాలు ఇతరులు ఎవరికీ ఇబ్బంది అనిపించవు. కానీ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు చేపట్టిన ఓ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో పార్టీ జెండాలు, టీషర్టులు ధరించి.. ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాన్ని పార్టీ వేదికగా మార్చడంపై విస్మయం వ్యక్తం చేశారు.
YSRCP MP Birthday Celebrations in Dwaraka Thirumala temple ఆలయమా.. అధికార పార్టీ కార్యాలయమా..? బర్త్డే వేడుకల పేరిట అత్యుత్సాహం దేవుడికే శఠగోపం.. దేవాదాయ భూమిపై వైఎస్సార్సీపీ నేతల గ'లీజు' దందా..!
ఆలయ కాటేజీలో విందు భోజనాలు..ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అధికార వైసీపీ నేతల అరాచకాలకు భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఎంపీ పుట్టినరోజు వేడుకలు శేషాచల కొండపై నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో భారీగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి చేరుకున్నారు. పార్టీ జెండాలు, ర్యాలీలతో శేషాచల కొండ మారుమోగింది. అంతేకాకుండా దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపంలో ఎంపీ పుట్టినరోజుకు సంబంధించి ఆలయ అధికారులు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ భోజనాలకు సంబంధించిన వంటలు దేవస్థానం అన్నదాన సిబ్బందితోనే చేయించారు. అలాగే భోజనాలు వడ్డించింది కూడా దేవస్థానం స్టాఫ్, స్వామివారి సేవకు వచ్చిన వారిని ఆలయ అధికారులు వినియోగించారు.
మహానందిలో వైసీపీ నేత అరెస్ట్.. టార్గెట్ చేశారా..!
ఉచితంగా అప్పగింత.. కొండపై కాటేజీల వద్ద ఎక్కడపడితే అక్కడ కేక్ కటింగ్ లు జరిపి ఉత్సవాల మాదిరిగా ఎంపీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సుమారు భోజనాల కార్యక్రమంలో పదివేలకు పైగా కార్యకర్తలు హాజరయ్యారు. అంతేకాక పార్టీకి సంబంధించిన టీషర్టులు ధరించి భోజనాలకు హాజరవడమే కాకుండా, పార్టీ జెండాలతో ర్యాలీలు జరుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకోవాల్సిన అధికారులు వారికి వత్తాసు పలికారు. అదేవిధంగా లక్షల రూపాయల విలువ గల కళ్యాణ మండపాలను ఉచితంగా ఎంపీ పుట్టినరోజు వేడుకలకు ఎలా ఇచ్చారని, దేవస్థానం అన్నదానానికి చెందిన సిబ్బందితో వంటలు ఎలా వండించారని, అలాగే సిబ్బందితోనే భోజనాలు వడ్డింపు కార్యక్రమం కూడా జరిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యాలయాన్ని తలపించేలా.. శేషాచల కొండపై యావత్తు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల సైతం ఆలయ అధికారుల తీరును చూస్తూ విమర్శలు చేశారు. పార్టీ మీటింగులు, భోజనాల కార్యక్రమాలు పుణ్యక్షేత్రంలో చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో ఆలయ ప్రతిష్ట మసకబారుతుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వైసీపీ పార్టీ కార్యక్రమాలకు, పుట్టినరోజు వేడుకలకు ద్వారకా తిరుమల చిన వెంకన్న క్షేత్రాన్ని వేదిక చేసినందుకు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వైసీపీ నేతల అంతులేని అరాచకాలు..