ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట కాలువల్లో గుర్రపుడెక్క తీయకుండా సాగు నీరు పారేదెలా? మా ఆకలి తీరేదెలా సార్? - రాష్ట్రంలో ఎండుతున్న వరిచేలు

YSRCP Government careless on Crop Canals Management: పంట కాల్వల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గుర్రపుడెక్క దట్టంగా పెరిగిపోయినా ఏలూరు నగర పరిధిలో చెత్తాచెదారాలను యథేచ్ఛగా పడేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నీరు అందక రైతులు నష్టపోతున్నా ఎవరికీ పట్టడం లేదు.

YSRCP_Government_Careless_on_Crop_Canals_Management
YSRCP_Government_Careless_on_Crop_Canals_Management

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 1:35 PM IST

Updated : Nov 7, 2023, 2:16 PM IST

పంట కాలువల్లో గుర్రపుడెక్క తీయకుండా సాగు నీరు పారేదెలా? మా ఆకలి తీరేదెలా సార్?

YSRCP Government Careless on Crop Canals Management :ఏలూరు జిల్లా పరిధిలోని గోదావరి, కృష్ణా పంట కాలువల ద్వారా సాగునీరు (Irrigation Water) అందక రైతులు ఇబ్బందులు (Farmers Problems) పడుతున్నారు. ఖరీఫ్ ఆరంభంలో రూ.48 లక్షలతో కృష్ణా కాలువలో రూ.8 లక్షల అంచనాలతో పూళ్ల నుంచి ఏలూరు వరకు గోదావరి కాలువలో తూడు, గుర్రపుడెక్క, కర్రనాచు తొలగింపు పనులు చేపట్టారు. అయితే నాణ్యమైన పనులు చేపట్టకపోవడం, తూతూ మంత్రంగా పనులు చేసి మమ అనిపించడంతో మళ్లీ కాలువలు పూడికతో నిండిపోయాయి. ఫలితంగా జిల్లాలో ప్రధాన పంట కాలువలైన కృష్ణా, గోదావరి కాలువల్లో గుర్రపు డెక్క దట్టంగా పేరుకుపోయి సాగునీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది..

Crops Drying Due to Officers not Remove Gurrapu Dekka in Canals :ఏలూరు మండలం ఇటు కృష్ణా...అటు గోదావరి పంట కాలువలకు శివారు మండలం కావడంతో.. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల్లో నీరు సక్రమంగా అందక వరి చేలు బీటలు వారాయి. పొట్ట దశలో ఉన్న వరి పొలాలకు సాగునీరు అందక ఏలూరు జిల్లాలోని శివారు ఆయకట్టు రైతులు ఇబ్బందు పడాల్సి వస్తోంది. కృష్ణా - ఏలూరు కాలువ కింద సుమారు 35వేల ఎకరాల విస్తీర్ణం ఉండగా గోదావరి - ఏలూరు కాలువ కింద దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్​లో కాలువల్లో తూడు సరిగా తొలగించని కారణంగా దాదాపు 3వేల 500 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు సాగు నీరు అందలేదు.

Rayalaseema Canals Ruins: పంట కాలువలపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం

Crop Canals Management Situation in Eluru District :కృష్ణా కాలువ కింద ఆయకట్టుకు ప్రస్తుతం వంతుల వారీ విధానంలో సాగునీరు అందిస్తుండగాకాలువలో గుర్రపుడెక్క(Gurrapu Dekka in Canals), తూడు, బద్దనాచు దట్టంగా అల్లుకుపోయింది. సాగునీటి విడుదల తగ్గడంతో పూడిక కారణంగా ప్రవాహం ముందుకు సాగడం లేదు. గోదావరి కాలువ కింద ఆశ్రం ఆస్పత్రి ఎగువ నుంచి ఏలూరు తూర్పు లాకుల వరకు గుర్రపు డెక్క, తూడు దట్టంగా పేరుకుంది. తొలగింపు పనులను జూన్ నుంచి వచ్చే ఏడాది రబీ సీజన్ వరకు గుత్తేదారు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

Godavari Delta Irrigation Canals: 'నేను విన్నాను.. నేను ఉన్నాను' హామీని కాలువల్లో కప్పేశారా..?: రైతులు

కాలువల్లో పూడిక తీయాలని రైతులు వేడుకోలు : ఇప్పటికైనా జనవనరుల శాఖ అధికారులు స్పందించి సకాలంలో కాలువల్లో పూడిక తీసి.. వచ్చే రబీ సీజన్​కైనా సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

crop canals: ప్రభుత్వ నిర్లక్ష్యంతో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దారుణంగా మారిన కాల్వల పరిస్థితి...

Last Updated : Nov 7, 2023, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details