Youth Interest to Zumba Dance in Eluru :ఆహ్లదకరమైన వాతావరణంలో సంగీతం వింటూ నృత్యం చేస్తూ, జుంబాడ్యాన్స్‌తో బరువు తగ్గడంతో పాటు చక్కటి శరీరాకృతి, ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నవారు ఎందరో. దీంతో ఒత్తిడి జయించేవాళ్లూ ఉన్నారు. పాట ఏదైనా వ్యాయామానికి అనుగుణంగా స్టేప్పులేయడమే జుంబా డ్యాన్స్. మహా నగరాలకే పరిమితమైన ఈ ఒరవడి ప్రస్తుతం ఏలూరుకు విస్తరించింది. దీంతో బరువు తగ్గడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఎమ్మెల్యే జుంబా డాన్స్... కేరింతలతో హోరెత్తించిన హీరో సంపూర్ణేష్ బాబు
Zumba Dance for Weight Loss : నిజానికి బరువు తగ్గించుకోడానికి ఎన్నో మార్గాలున్నాయి. పరుగు, ఆటలు, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, జిమ్‌కెళ్లడం ఇలా ఎన్నున్నా అవి కష్టంతో కూడుకున్నవే. పైగా వీటిలో కొన్ని ఆరుబయట, లేదా మైదానాల్లో చేయాల్సి ఉంటుంది. వీటితో బరువు తగ్గినా ఒత్తిడి దూరమౌవు తుందని చెప్పలేం. కానీ, వాటికి భిన్నంగా ట్రెండ్‌కి అనుగుణంగా సులువుగా బరువు తగ్గడంతో పాటు అందమైన శరీరాకృతి, ఒత్తిడి దూరం చేసేదే జుంబా డ్యాన్స్.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతం వింటూ పాటకు అనుగుణంగా పాదాలు కదుపుతూ డ్యాన్స్ చేయడమే జుంబా ప్రత్యేకత. దీంతో రోజును హుషారుగా ప్రారంభించడంతో ఆ రోజంతా అదే ఉత్తేజంతో గడుపుతారు. జుంబాతో ఒళ్లు నొప్పులు రావడం, కీళ్లు పట్టేసినట్లు ఉండటం లాంటివి ఉండవు. - సుష్మ, జుంబా సెంటర్ నిర్వాహకురాలు
జిమ్ కేంద్రాల్లోలాగా జుంబాలో రోజూ ఒకే రకమైన వర్కౌట్లు ఉండవు. ఇందులో సల్సా, బెల్లీ, కుంబీయా, ఆర్జెంటీనా, టాంగో వంటి డ్యాన్సులుంటాయి. వీట్లో రోజుకి ఒక్కటి చేయిస్తూ ప్రతి రోజు ప్రత్యేకంగా ఉండేలా చూస్తాము. 40 నిమిషాలు ఆపకుండా జుంబా డ్యాన్స్ చేస్తే శరీరంలో రోజుకు 800 నుంచి వెయ్యి వరకు కేలరీలు తగ్గుతాయి. ఎలాంటి డైట్ లేకుండానే అది సాధ్యమౌతుంది. - అనిల్, జుంబా ట్రైనర్