LOVE ATTACK ప్రేమ పేరుతో యువతిని బంధించి వేడి నూనె పోసిన యువకుడు - young man poured hot oil on young woman in Eluru
10:11 April 23
యువతికి తీవ్రగాయాలు.. ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
LOVE ATTACK ఎన్నిచట్టాలు తెచ్చినా.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి వరకూ ప్రేమిస్తున్నామంటూ వెంటపడతారు. ఆ తర్వాత అమ్మాయి వద్దనే సరికి వారిలోని మృగాన్ని మేల్కొల్పుతారు.. దాడులు చేయడానికి. యాసిడ్లు పోయడానికి సిద్దపడతారు. తాజాగా ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణం జరిగింది. ప్రేమించలేదని ఓ యువకుడు ఇంజినీరింగ్ విద్యార్థినిని చిత్రహింసలు పెట్టాడు. గదిలో బంధించి ఆమె ఒంటిపై వేడి నూనె పోసి టార్చర్ చేశాడు. ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న అనుదీప్ అనే యువకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇంజినీరింగ్ విద్యార్థినిని గదిలో ఒంటరిగా బంధించి వేడి నూనెను పోశాడు.
ఆ ప్రేమోన్మాది దాడిలో యువతికి చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి.. అనుదీప్ నుంచి తప్పించుకున్న యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు హుటాహుటిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. బాధిత యువతి కాకినాడలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: