ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట బీమాలో జగన్​ గారడీ - కప్​ అండ్​ క్యాప్​ విధానంతో అన్నదాతలకు కుచ్చుటోపీ - ఏపీ ప్రధానవార్తలు

YCP Government left From Crop Insurance: బీమా పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. ఉచిత పంటల బీమాపై అన్నదాతలకు తీరని ద్రోహం చేస్తోంది. ప్రీమియం తగ్గించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ అన్నదాతల్ని బలితీసుకుంటున్నారు. బీమా పథకం అమలు ప్రభుత్వానికి చేతకాక రెండు సంవత్సరాలకే చేతులేత్తేసింది.

ycp_government_left_from_crop_insurance
ycp_government_left_from_crop_insurance

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 3:22 PM IST

పంట బీమాలో జగన్​ గారడీ - కప్​ అండ్​ క్యాప్​ విధానంతో అన్నదాతలకు కుచ్చుటోపీ

YCP Government left From Crop Insurance: రైతు సంక్షేమం అంటూనే వైసీపీ ప్రభుత్వం కర్షకులకు తీరని ద్రోహం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌. ఉచిత పంటల బీమా ఇస్తామంటూ రైతన్నలను నిలువునా ముంచారు. ప్రీమియం కూడా కట్టలేమని చేతులెత్తేస్తూ అన్నదాతల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఖరీఫ్‌లో సర్వం కోల్పోయిన రైతులపై ఉదారత చూపకుండా నామమాత్రపు సాయంతోనే సరిపెట్టేశారు. కప్‌ అండ్ క్యాప్ విధానాన్ని ఎంచుకుని బీమాకు భారీ కోత పెట్టారు.

ఈ ఏడాది తీవ్ర కరవు, తుపానులతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వాస్తవ సాగు కంటే ఈసారి బీమా చేసిన విస్తీర్ణమే తక్కువ. దానికీ ఎక్కువ ప్రీమియం ఎందుకనే ఆలోచనతో కోత పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. కనీసం ఆ ప్రీమియం సొమ్మునూ బీమా సంస్థలకు చెల్లించలేదు. జగన్‌ సర్కార్ చర్యలతో బీమా వ్యవహారం గందరగోళంగా మారనుంది. 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ కప్‌ అండ్‌ క్యాప్‌ విధానాన్ని ఎంచుకుందని, ఈ నెల 19న లోక్‌సభలో వైసీపీ ఎంపీలు రెడ్డప్ప, గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.

కప్ అండ్ క్యాప్ విధానంలో 100రూపాయల ప్రీమియం కడితే పంట నష్టానికి 110 రూపాయలకు మించి పరిహారం ఇవ్వరు. అదే పంట నష్టం తగ్గినట్లు చూపిస్తే చెల్లించిన ప్రీమియంలోనే కొంత మొత్తాన్ని బీమా సంస్థలు వెనక్కి తిరిగిస్తాయి. అంటే పంట నష్టం తగ్గితే సర్కారు ఖజానాకు ప్రీమియం డబ్బు తిరిగి వస్తుంది.

పంటల బీమాపై రైతన్నల ఆశలు - పరిహారాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వం

పంటల బీమా పరిహారం పెరిగినా బీమా సంస్థలు 110 శాతం వరకే అనుమతిస్తాయి. మిగిలిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రీమియం రూపంలో చెల్లించాలి. ఈ లెక్కలు తెల్చేనాటికి అంతా ఎన్నికల హడావుడి ఉంటుంది. ఒకవేళ చెల్లించాల్సి వచ్చినా కొత్త ప్రభుత్వమే భరించాలి. ఇవన్నీ ఎందుకులే అని పంట నష్టం తగ్గించుకునేందుకు లెక్కల్లో కోత పెడితే రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రీమియం చెల్లించినా, సరైన పరిహారం ఇవ్వడం లేదని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎం జగన్‌ చెప్పారు. 2020-21లో కేంద్ర బీమా పథకం నుంచి బయటకొచ్చారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొంతంగానే పంటల బీమా అమలు చేస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఎన్ని ఎకరాలకు బీమా చేశారనే లెక్కలు లేవు.

పంటల బీమాపై రైతుకు ఉందా ధీమా ?

వాస్తవ పంట నష్టం వేల కోట్లలో ఉన్నా, ప్రభుత్వంపై భారం తగ్గించేందుకు కుదించి చూపారు. నిబంధనల పేరుతో మిరప, ఇతర పంటల రైతులకు సాయాన్ని మరిచారు. 2020-21 నుంచి రబీలో బీమా ఊసే లేదు. జగన్‌ సర్కారు 2020-21, 2021-22లో ఖరీఫ్‌ వరకే పంటల బీమా అమలు చేసింది. ఇక తమ వల్ల కాదని చేతులెత్తేసి మళ్లీ కేంద్రం పంచన చేరింది. దానికి ఏదో ఒక సాకు కావాలి కాబట్టి తాము చెప్పిన నిబంధనలకు కేంద్రం అంగీకరించిందని, అందుకే మళ్లీ చేరామని నమ్మబలికింది. ఇప్పుడు కొత్త విధానం ఎంచుకుని రైతుల్ని నట్టేట ముంచే చర్యలకు పాల్పడింది.

కప్‌ అండ్‌ క్యాప్‌ విధానం ప్రకారం చూస్తే ఈ ఏడాది చెల్లించాల్సిన ప్రీమియం 1274 కోట్లు. పంట నష్టం కింద చెల్లించాల్సిన పరిహారం మొత్తం ప్రీమియంలో 80శాతం అంటే సుమారు వెయ్యి19 కోట్లు కంటే దిగువన ఉంటే మిగిలిన 20 శాతంలో కొంత మొత్తం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుంది. అంటే రైతులకు ఎంత ఎక్కువ ఇవ్వొచ్చు అనే ఆలోచన కాకుండా, తిరిగి ఖజానాకు ఎంతొస్తుందనే ప్రభుత్వం ఆలోచించింది.

'అనంత' కరవు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర - ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట బీమా ప్రకటించాలని రైతుల డిమాండ్

పంట నష్టం భారీగా జరిగితే బీమా సంస్థలు పరిహారంగా 1400 కోట్లకు మించి చెల్లించవు. పరిహారం ఎంత పెరిగితే ఆ మేరకు ప్రీమియాన్ని ప్రభుత్వం మళ్లీ చెల్లించాలి. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన పంటనష్టానికి 10వేల కోట్ల పంటల బీమా పరిహారం చెల్లించినా తక్కువే. అంత స్థాయిలో రైతులు దెబ్బతిన్నారు. కానీ వారిని ఆదుకోవాలనే ఆలోచన లేకుండా ఎగనామం పెట్టే నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం పాత విధానాన్ని ఎంచుకుంటే ప్రీమియం సుమారు వెయ్యి కోట్లు పెరిగేది. అప్పుడు పంట నష్టం ఎంత ఎక్కువగా ఉన్నా ఆ మేరకు పరిహారం మొత్తాన్ని బీమా సంస్థలు సొంతంగా చెల్లించేవి. రాష్ట్రం అదనంగా మళ్లీ చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రీమియం పెరుగుతుందనే కారణంతో ప్రభుత్వం కొత్త విధానంలోకి మారింది. జగన్ అనాలోచిత విధానాల వల్ల అన్నదాతలకు తీరని ద్రోహం జరుగుతుంది.

Free Crop Insurance: గందరగోళంగా పంటల బీమా.. తీరని అన్యాయం జరిగిందంటున్న రైతుల

ABOUT THE AUTHOR

...view details